OFFICIALS ON HIGH ALERT: తుపాను ప్రభావం విజయనగరం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని ఆమె ఆదేశించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర ప్రాంత గ్రామాలను పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ వెనక్కి రావాలని స్పష్టం చేశారు. చేపల కంచేరు తీరంలో సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులను వెనక్కి రప్పించి పడవలను ప్రత్యేక ట్రాక్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా భోగాపురం, పూసపాటిరేగ, గరివిడి, చీపురుపల్లి ప్రాంతాలకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని రైతన్నలు ఇప్పటికే వరికంకులను కోసిన వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని సూచించారు.
విశాఖ జిల్లా..