ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా: అప్రమత్తమైన వాల్తేరు డివిజన్​ అధికారులు - visakaha railway station latest updates

కరోనా వైరస్​ బారిన పడకుండా వాల్తేరు డివిజన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు మాస్క్​లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలిచ్చారు. రైల్వే ట్రాక్​లపై పనిచేస్తున్న సిబ్బందికి మంచి నీటి క్యాన్​లను అందజేశారు. చేతులు శుభ్రంగా ఉంచేందుకు కావలసిన నీటిని, సబ్బులను అందుబాటులో ఉంచామని వాల్తేర్​ డీఆర్​ఎం తెలిపారు.

officers taking measures due to corona effect
ఉద్యోగులకు మాస్క్​లు పంచుతున్న డీఆర్​ఎం

By

Published : Mar 19, 2020, 6:07 PM IST

కరోనా: అప్రమత్తమైన వాల్తేరు డివిజన్​ అధికారులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా డివిజన్ పరిధిలో చర్యలు తీసుకున్నామని వాల్తేర్​ డీఆర్​ఎం చేతన్​కుమార్​ శ్రీ వాస్తవ్​ తెలిపారు. డివిజన్​లో ఉన్న రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రైల్వే ట్రాక్​ల వెంబడి బాధ్యతలు నిర్వహించే ట్రాక్, గ్యాంగ్ మెన్​లకు ఉచితంగా రెండున్నర లీటర్ల మంచినీటి క్యాన్​లను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details