ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజారోగ్య పరిరక్షణకు మరో ప్రణాళిక.. వాడిన వంటనూనెతో జీవ ఇంధనం.. - ap latest news

వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించాలన్న ఉద్దేశంతో..భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ-F.S.S.A.I. వినూత్న ఆలోచన చేసింది. వాడిన వంట నూనెలతో జీవ ఇంధన ఉత్పత్తికి ప్రణాళికలు రచించింది. ఇందుకోసం రోజూ 50 లీటర్లకు మించి నూనెలను వినియోగించే హోటళ్లు, దుకాణాలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

officers-making-biofuel-with-used-cooking-oil
ప్రజారోగ్య పరిరక్షణకు మరో ప్రణాళిక.. వాడిన వంటనూనెతో జీవ ఇంధనం..

By

Published : Oct 3, 2021, 6:57 AM IST

Updated : Oct 3, 2021, 10:25 AM IST

సాధారణంగా మిగిలిన నూనెలను కాలువల్లో పారబోయడం, మంట కోసం పొయ్యిలో వేయడం చేస్తారు. వీటి వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉంది. అదే విధంగా వాడిన నూనెను మూడోసారి వాడితే కొంత అనర్థం తప్పదు. వంట నూనెలో.... నూనె నాణ్యత తెలిపే ప్రమాణం-టీ.పీ.సీ 25 శాతానికి మించకూడదు. తాజా నూనెలో 7 శాతం, రెండోసారి 15నుంచి 18 , మూడోసారి 24 శాతం ఉంటుంది. ఎక్కువసార్లు వాడిన నూనెతో గుండె, కాలేయ జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు వస్తాయి. 25 దాటితే ఆహారానికి పనికిరాదని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రజారోగ్య పరిరక్షణకు ఎఫ్​.ఎస్​.ఎస్​.ఏ.ఐ మరో ప్రణాళిక రూపొందించింది. వాడిన నూనెను రెండు సార్లు కంటే ఎక్కువ వినియోగించకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.

ప్రజారోగ్య పరిరక్షణకు మరో ప్రణాళిక.. వాడిన వంటనూనెతో జీవ ఇంధనం..

ఇలా చాలావరకు రాష్ట్రంలో మిగులు నూనె దుర్వినియోగం అవుతోంది. చాలా మంది వ్యాపారులు డబ్బులకు ఆశపడి వీధి వ్యాపారులకు విక్రయిస్తారు. ఇంకొందరు వీటిని అనైతిక పద్ధతుల్లో వంట నూనెగా తయారుచేసి విక్రయిస్తారు. ఈ ముప్పును గుర్తించిన ఎఫ్​.ఎస్​.ఎస్​.ఏ.ఐ.. వాడిన నూనెలను జీవ ఇంధన తయారీ సంస్థలకు విక్రయించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు నాలుగు వరకు ఉన్నాయి. ఈ సంస్థలు ఎఫ్​.ఎస్​.ఎస్​.ఏ.ఐ నుంచి రీయూస్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌ లైసెన్స్‌ తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా హోటళ్లు, మిఠాయి దుకాణదారుల వద్ద వాడిన నూనెను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వాళ్లూ తప్పనిసరిగా వారికి సప్లై చేయాలి.

వాడిన వంట నూనె సేకరణకు సదస్సులు పెట్టి హోటల్‌ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. జీవ ఇంధన సంస్థలు హోటళ్లను సంప్రదించి నెలకోసారి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం హోటళ్ల వద్ద డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని అపార్టుమెంట్ల వరకు విస్తరించి ఎక్కువ మొత్తంలో సేకరించి జీవ ఇంధనం తయారీని ప్రోత్సహించనున్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిళ్లు దుకాణాల్లో రోజుకు ఎంత నూనె కొనుగోలు చేశారు... ఎంత వినియోగించారన్నది లెక్క చెప్పాలి. అంతేకాకుండా ఆ వాడిన నూనెను ఏం చేస్తున్నారో కూడా వివరించాలి. వీటిపై ఆహార భద్రత అధికారులు ప్రతి నెలా తనిఖీ చేసి ఆడిట్‌ నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:వినూత్న పంటల సాగుతో పలువురు రైతుల స్ఫూర్తి

Last Updated : Oct 3, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details