ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ఖాళీ స్థలాల గురించి అధికారుల ఆరా..! - executive capital visakha

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని రావచ్చన్న ప్రకటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనాల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనుకూలమన్న అంశంపై జిల్లా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

officers inquiry about lands in visakha
విశాఖలో ఖాళీ స్థలాల గురించి అధికారుల ఆరా..!

By

Published : Dec 22, 2019, 7:23 AM IST

విశాఖలో ఖాళీ భవనాలు ఎక్కడున్నాయి... వాటిలో ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉందన్న విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సాగరనగరంలో కార్యనిర్వాహక రాజధాని రావచ్చన్న ప్రకటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనాల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనుకూలమన్న అంశంపై జిల్లా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. విప్రో సంస్థకు నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాలు కేటాయించింది. ఆ భూముల్లోని కొంత భాగంలో మాత్రమే ఒక భవనాన్ని విప్రో సంస్థ నిర్మించింది.

మిగిలిన భూభాగాన్ని ఖాళీగా ఉంచింది. శనివారం విప్రో కార్యాలయాన్ని జేసీ వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులను అడిగి స్థలం వివరాలు తెలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన భవనాల పరిశీలన కోసం కాదన్న జేసీ... హైదరాబాద్‌ విప్రో భవనానికి విశాఖ భవనానికి గల తేడాలు చూసేందుకే అక్కడకు వెళ్లామని చెప్పారు. రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని... తాము ఎలాంటి పక్రియ ప్రారంభించలేదని పాలనాధికారి వినయ్‌ చంద్‌ స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details