3k Run: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా అనకాపల్లిలో 3K రన్ నిర్వహించారు. అనకాపల్లి డీఎస్పీ సునీల్, దిశా స్టేషన్ డీఎస్పీమహేశ్వరరావు దీనిని ప్రారంభించారు. మహిళా పోలీస్ సిబ్బందితో పాటు స్థానికులు ఈ రన్‌లో పాల్గొన్నారు. మహిళా భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ చూపిస్తోందని డీఎస్పీలు సునీల్, మహేశ్వరరావు తెలిపారు. ఆరోగ్యానికి వ్యాయామం అవసరమని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్ తెలిపారు.
3k Run in visakhapatnam: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో 3K రన్ - latest news in vizag
3k Run: విశాఖ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లిలో 3K రన్ నిర్వహించారు. మహిళా భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ చూపిస్తోందని డీఎస్పీలు సునీల్, మహేశ్వరరావు తెలిపారు.
విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3K రన్