విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్)-2041 ముసాయిదాపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయి. విస్తృతమైన పరిధికి సంబంధించినది కావడంతో ప్రజలు వివరాలు తెలుసుకొని పెద్ద సంఖ్యలో వినతులు అందిస్తున్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది.
వాస్తవానికి బృహత్తర ప్రణాళికను దాదాపు వారం రోజుల కిందటే తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. బృహత్తర ప్రణాళిక వివరాలతో పాటు ఆయా మండలాల చిత్రపటాల వివరాలు తెలుగులోకి మార్చారు. వాటిని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం కలిగింది. దీంతో అభ్యంతరాలు తెలియజేసేందుకు మరికొంత సమయం కావాలని కోరుతున్నారు.
వీఎంఆర్‌డీఏ 4873.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి బృహత్తర ప్రణాళిక తయారు చేసింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో 35 మండలాలకు ఇది వర్తించనుంది. ఈ ప్రణాళికలో భూవినియోగ వివరాలతో పాటు ఆయా ప్రాంతాల్లో కొత్త రోడ్లను ప్రతిపాదించారు. ప్రతిపాదిత రోడ్ల కారణంగా ఆయా మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి. దీనిపై చాలా గ్రామాల్లోని ప్రజలకు అంత అవగాహన లేదు. తెలుగులోకి తీసుకురావడంతో గ్రామీణ ప్రజలు సైతం చదువుకునేందుకు వీలుగా మారింది. ఈ పరిస్థితుల్లో మరికొంత సమయం ఇవ్వాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.
మొదట ఆంగ్లంలో