ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2022, 7:04 PM IST

ETV Bharat / city

NTPC Ash Pond Pollution: 'బూడిద ప్రాణాంతకంగా మారింది'.. నిపుణుల కమిటీకి స్థానికుల మొర

NTPC Ash Pond Pollution: విశాఖ జిల్లాలో ఎన్టీపీసీ బూడిద కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు మొరపెట్టుకున్నారు. యాష్‌ పాండ్‌ను తరలించకపోతే.. కనీసం కాలుష్య నివారణ చర్యలైనా చేపట్టాలని ఎన్జీటీ నియమించిన కమిటీని వేడుకున్నారు. కాలుష్య ప్రభావిత ప్రాంతంలోని మట్టి, నీరు నమూనాలపై అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు.

NTPC Ash Pond Pollution
NTPC Ash Pond Pollution

'బూడిద ప్రాణాంతకంగా మారింది'.. కమిటీ ముందు బాధితుల మొర

NTPC Ash Pond Pollution: విశాఖ జిల్లా పరవాడ మండలం ఎన్టీపీసీ సింహాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం యాష్ పాండ్ కాలుష్యంతో.. సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిత్యం ఇళ్లలో బూడిద పేరుకుపోవడం అటుంచితే.. వృద్ధుల అనారోగ్య సమస్యలు వర్ణనాతీతం. ఇటీవల పిట్టవానిపాలెం వాసి ఫిర్యాదుతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సదరు కమిటీ.. పిట్టవానిపాలెం, మరడదాసరిపేట, దేవాడ గ్రామాలను సందర్శించింది.

బూడిద ప్రాణాంతకంగా మారిందని.. బాధిత గ్రామాల ప్రజలు కమిటీకి వివరించారు. తిండి, గాలి, నీరు, ఇళ్లు కాలుష్యమయం అవుతున్నాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా భూగర్భజలాలు కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటోందని.. ఇక్కడి జనం వాపోయారు. కమిటీ బృందంలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల ముఖ్య అధికారులు ఉన్నారు. మట్టి, నీరు నమూనాలు నిశితంగా పరిశీలిస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details