ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్నిమాపకశాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్' - హోం మంత్రి సుచరిత వార్తలు

అగ్నిమాపక శాఖలోని పోస్టుల భర్తీకి జనవరిలో ప్రకటన విడుదల చేస్తామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. ఈ శాఖలోని సిబ్బంది అందిస్తున్న సేవల్ని కొనియాడారు.

sucharitha
మేకతోటి సుచరిత

By

Published : Dec 22, 2019, 6:39 PM IST

అగ్నిమాపక శాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్​ ఇస్తామన్న హోంమంత్రి సుచరిత

విశాఖలోని సూర్యబాగ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో ఈ కేంద్రం సేవలందించనుందని తెలిపారు. అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో సిబ్బంది అందిస్తున్న సేవల్ని హోంమంత్రి అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన అగ్నిమాపక సిబ్బందిని సన్మానించారు. అగ్నిమాపకశాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details