విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు పంచాయతీ కార్యాలయాల నుంచి నామినేషన్ పత్రాలను తీసుకెళ్తున్నారు.
విశాఖ జిల్లాలో..

మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పలు పంచాయతీల నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు కావడంతో నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. చీడికాడ మండలం ఖండివరంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి నామినేషన్లు సమర్పించారు.
ప్రకాశం జిల్లాలో..
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమం మందకొడిగా ప్రారంభం అయ్యింది. పరుచూరు, కొండేపి నియోజకవర్గాల్లోని పలు పంచాయతీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం నుంచి రామన్నపేట పంచాయతీకి మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. తొలి రోజు మందకోడిగా సాగిన నామినేషన్ ప్రక్రియ.. శని, ఆదివారాల్లో జోరందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు పేర్కొన్నారు.