కరోనా కారణంగా జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలువురు తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించేందుకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ నగరంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పెంపుడు జంతువుల యజమానులు నిరాశతో అక్కడ నుంచి వెనుదిరిగారు.
కరోనా నేపథ్యంలో పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ రద్దు - vizag latest news
విశాఖలో కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా పెంపుడు జంతువులకు టీకా వేసే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పశువైద్య శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఆసుపత్రికి పెంపుడు జంతువులు తీసుకువచ్చిన యజమానులు అక్కడ నుంచి వెళ్లారు.
పెంపుడు జంతువులకు టీకా కార్యక్రమం రద్దు