కరోనా వ్యాప్తి నివారణ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనాను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని... అలాగే ఆందోళన చెందవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లోని వదంతులను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధరణ అయ్యాకే బయటకు పంపుతామని తెలిపారు.
కరోనాను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దు: మంత్రి అవంతి - మంత్రి అవంతి శ్రీనివాసరావు వార్తలు
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మంత్రి అవంతి