ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు - NIA actions on visakha naval spying case

విశాఖ నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్​ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 15 మందిని ఎన్​ఐఏ కటాకటాల్లోకి నెట్టింది.

విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు
విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు

By

Published : Jun 6, 2020, 8:13 PM IST

Updated : Jun 6, 2020, 8:36 PM IST

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి ముంబయి వాసి అబ్దుల్​ రెహమాన్​ జబ్బార్​ను ఎన్​ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జబ్బార్​ భార్యను అరెస్టు చేసిన ఎన్​ఐఏ.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చర్యలు తీసుకున్నారు.

నౌకాదళ స్థావరాలపై ఐఎస్​ఐకు సమాచారం ఇచ్చారంటూ గతంలో 11 మంది నౌకాదళ ఉద్యోగులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ కేసులో మహమ్మద్​ హాజీ అనే వ్యక్తిని గత నెలలో అరెస్టు చేసిన ఎన్​ఐఏ.. ఇప్పటి వరకు మొత్తం 15 మందిని కటాకటాల్లోకి నెట్టింది.

నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐకు చేరవేస్తున్న వైనాన్ని నిఘా సంస్థలు రట్టు చేశాయి. భారత్​లో ఉన్న నౌకాదళ స్థావరాలు, జలాంతర్గాములు, రక్షణ సమాచారాన్ని తెలుసుకునేందుకు కొంతమంది గూఢచారులను పాకిస్థాన్​ గూఢచర్య సంస్థలు నియమించినట్లు అధికారులు గుర్తించారు.

కొంతమంది నేవీ సిబ్బంది ఫేస్​బుక్​, వాట్సాప్​ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా.. పాకిస్థాన్​ పౌరులతో సంప్రదింపులు జరిపారని.. గత నెలలో ఎన్​ఐఏ తెలిపింది. కీలక సమాచారాన్ని అక్కడికి చేరవేసినట్లు గుర్తించామని పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్​లో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న భారతీయ సహచరుల ద్వారా నగదు నేవీ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి..

హీరో సూర్య తండ్రిపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

Last Updated : Jun 6, 2020, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details