Baby in train toilet: ఓ వైపు తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. రైలులో అప్పుడే ఓ శిశువు జన్మించింది. తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన పసికందును ఓ తల్లి రైలులోని మూత్రశాలలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.
Baby in train toilet: అప్పుడే పుట్టిన శిశువు.. రైలు టాయిలెట్లో వదిలివెళ్లిన తల్లి - విశాఖలోని రైలులో గుర్తుతెలియని మహిళ ప్రసవం
Baby in train toilet: అమ్మ వెచ్చని స్పర్శలో హాయిగా నిద్రించాల్సిన ఆ పసికూన మరుగుదొడ్డిలో ఏడుస్తూ కనిపించింది.. తల్లిపాలు తాగుతూ ఆకలి తీర్చుకోవాల్సిన ఆ శిశువు మురుగు వాసనలో ఆకలితో తల్లడిల్లింది.. మాతృప్రేమలో మునిగితేలాల్సిన ఆ పసిపాప.. ఆమె ఎలా ఉంటుందో తెలియక అల్లాడిపోయింది. ఏ తల్లికి ఏ కష్టం వచ్చిందో.. లేక క్షణికావేశంలో చేసిన తప్పుకో ఆ బిడ్డను బలి చేసింది. పుట్టిన నిమిషాల వ్యవధిలోనే రైలు టాయిలెట్లో వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయింది. ఏ పాపం తెలియని ఆ శిశువును ఈ లోకంలోకి తెచ్చి అనాథను చేసింది..
విశాఖలో ధన్‌బాద్- అలెప్పి ఎక్స్‌ప్రెస్ రైలులో నవజాత శిశువును వదిలేసిన ఘటన కలకలం రేపింది. బి-1 బోగి టాయిలెట్ వాష్ బేసిన్‌లో మగ శిశువును ఓ తల్లి విడిచి వెళ్ళిపోయింది. శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. మెరుగైన వైద్యం కోసం రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును ఎవరు విడిచి వెళ్ళారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: