విశాఖ విమానాశ్రయంలో కొత్త టాక్సీ వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎన్-3, ఎన్-4కి అదనంగా ఎన్-5 టాక్సీ వే కూడా సేవలు అందించనుంది. దీన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ప్రారంభించారు. ఫలితంగా ఎయిర్ పోర్టులో రద్దీ సమయంలో మరిన్ని వాణిజ్య విమానాల రాకపోకలు సదుపాయం ఏర్పడింది.
విశాఖ విమానాశ్రయం తూర్పునౌకాదళం నియంత్రణలో ఉంది. ఒకవైపు రక్షణ అవసరాల విన్యాసాలకు విమానాల కోసం వినియోగిస్తూనే.. పౌర విమానాలను ఈ ఎయిర్ పోర్టులో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకు రద్దీ సమయంలోనూ విమానాల రాకపోకలకు ఈ అదనపు సదుపాయం ఉపకరిస్తుంది. విమానాశ్రయం ఆధునీకరణ, అభివృద్ది పనులలో భాగంగా ఈ టాక్సీ వేకు రూపకల్పన చేశారు.