ఈ ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు డివిజన్‌కు చెందిన 5 రైళ్లకు లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు కేటాయించనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. రైల్వే ఔత్సాహికుడు కె.రవితేజ సమాచారహక్కుచట్టం ద్వారా పెట్టిన దరఖాస్తుకు అధికారులు స్పందించారు. తూర్పుకోస్తారైల్వేలోని 3 డివిజన్లలో మొత్తం 10 రైళ్లు ఎల్‌హెచ్‌బీగా మారతాయని, ఇందులో విశాఖమీదుగా నడిచే 5 రైళ్లున్నట్లు లేఖ ద్వారా బదులిచ్చారు. ఆ రైళ్ల వివరాలివీ..
రైలునెంబరు - మార్గం (రైలు పేరు)
* 18463/64 - భువనేశ్వర్-బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్)
* 12803/04, 12807/08 - విశాఖపట్నం-నిజాముద్ధీన్ (స్వర్ణజయంతి, సమతా ఎక్స్‌ప్రెస్)
* 12805/06 - విశాఖపట్నం-లింగంపల్లి (జన్మభూమి ఎక్స్‌ప్రెస్)
* 58501/02 - విశాఖపట్నం-కిరండూల్ (కిరండూల్ ప్యాసింజర్)
* 58537/38 - విశాఖపట్నం-కోరాపుట్ (కోరాపుట్ ప్యాసింజర్)
LHB COACHES: ఆ ఐదు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు - ap news updates
వాల్తేరు డివిజన్‌లోని ఐదు రైళ్లకు లింక్ హాఫ్‌మన్ బుష్ బోగీలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే తెలిపింది. కె.రవితేజ అనే వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా కోరిన మేరకు అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.
NEW LHB COACHES