కీళ్ల అరుగుదలను నివారించి సుమారు దశాబ్దాల పాటు వాటి మార్పిడి అవసరం లేకుండా చేసే చికిత్సను... విశాఖలోని క్యూ వన్ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చింది. విటమిన్ (E)ఈ పాలీఇథిలీన్ అనే నూతన విధానం ద్వారా చికిత్స చేస్తున్నట్టు వైద్యులు రమణమూర్తి చెప్పారు. ఈ విధానంలో కీళ్ల మార్పిడి చేయడం వల్ల రోగికి ఎక్కువ కాలం కీళ్ల అరుగుదల లేకుండా ఉంటుందని చెప్పారు. సమస్య ఉన్నా.. వెంటనే కోలుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆవిష్కరణ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి అని రమణ మూర్తి తెలిపారు.
కీళ్లమార్పిడిలో నూతన ఆవిష్కరణ
విశాఖలోని క్యూ వన్ హాస్పిటల్... కీళ్లమార్పిడి శస్త్రచికిత్స లో నూతన ఆవిష్కరణలకు నాంది పలికింది. విటమిన్ E పాలిఇథిలీన్ వాడకంతో అత్యధిక కాలం కీళ్లమార్పిడి చేయవలసిన అవసరం లేకుండా ఉంటుందని క్యూ వన్ వైద్యులు తెలిపారు.
నూతన విధానాన్ని ఆవిష్కరిస్తున్న వైద్యులు