ఈ నెలాఖరుకు విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27 నుంచి విశాఖ-చెన్నైకు స్పైస్‌జెట్ సంస్థ విమాన సర్వీసులు ఆరంభించనుంది. ఉదయం 6 గంటల 35నిమిషాలకు చెన్నైలో బయలుదేరి ఉదయం 8గంటల 10నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ ఉదయం 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.55కి చెన్నై చేరుకుంటుంది.
విశాఖ-విజయవాడ మధ్య మరో విమాన సర్వీసు ఉదయం 8.30 గం.కు విశాఖలో బయలుదేరి 9.30కి విజయవాడ చేరుతుంది. ఉదయం 9.50 గం.కు విజయవాడలో బయలుదేరి 10.50కి విశాఖ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజుల్లో సర్వీసులు నడుపుతామని స్పైస్‌జెట్ సంస్థ స్పష్టం చేసింది.