ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఇంత శాడిస్ట్​ ప్రభుత్వాన్ని... ఎప్పుడూ చూడలేదు" - విశాఖలో జనసేన లాంగ్​మార్చ్

ఇసుక లేక, పనులు లేక ఐదు నెలలుగా కార్మికులు బాధ పడుతున్నారని తెదేపా నేతలు అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పని చేయించేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైకాపాకు 151 సీట్లిచ్చి గెలిపిస్తే 5నెలల్లోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.

తెదేపా

By

Published : Nov 3, 2019, 8:54 PM IST

ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్​మార్చ్​కు హాజరైన తెదేపా నేతలు.. వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందించని సీఎంను తానెప్పుడూ చూడలేదని అయ్యన్నపాత్రుడు అన్నారు. లారీ ఇసుక ధర రూ.50 వేలకు చేరిందని తెలిపారు. దీనివల్ల నిర్మాణాలు జరగక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అప్పట్లో గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి తరలివచ్చినట్లుగా ఇప్పుడు లాంగ్‌మార్చ్‌కు ప్రజలు తరలివచ్చారని అన్నారు.

లాంగ్​మార్చ్​ సభలో తెదేపా నేతల ప్రసంగం
నువ్వా పవన్​ని విమర్శించేది: అచ్చెన్నాయుడువైకాపా సర్కార్​ అంత శాడిస్ట్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కల్లు తాగిన కోతిలాగా రాష్ట్రంలోని మంత్రులు ఇసుక కొరతపై పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖకు చెందిన ఓ మంత్రి పవన్​ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటున్నారని... ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియని ఆయన... పవన్​ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ కలిసిరావాలని కోరారు. కార్మికుల పక్షాన పోరాడుతున్నందునే జనసేనకు తెదేపా మద్దతు ఇచ్చిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details