విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, విశాఖపట్నం ఎన్.సి.సి. గ్రూప్ కమాండర్ కెప్టెన్ నీరజ్ సిరోహి సంతకాలు చేశారు. ఎన్‌సీసీ అధికారులకు మానవ వనరుల నిర్వహణలో పీజీ, డిప్లమో సర్టిఫికెట్లు ప్రదానం చేసేందుకే ఈ ఒప్పందమని ఏయూ వీసీ వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్‌సీసీ ఒప్పందం - విశాఖ తాజా వార్తలు
తమ సిబ్బందికి వివిధ కోర్సుల్లో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్‌సీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, విశాఖపట్నం ఎన్.సి.సి. గ్రూప్ కమాండర్ కెప్టెన్ నీరజ్ సిరోహి సంతకాలు చేశారు.
andhra pradesh