NCC Camp In Vishaka: అఖిల భారత నవ సైనిక్ ఎన్సీసీ క్యాంప్‌నకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు నేవల్ చిల్డ్రన్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నేవల్ ఎన్సీసీ క్యాడెట్లు హాజరుకానున్నారు. ఎన్సీసీ డైరెక్టరేట్లు 17, సీనియర్ వింగ్ బాలికలు 204, సీనియర్ వింగ్ బాలురు 408 ఈ శిబిరానికి హాజరుకానున్నారు. ఈ క్యాంప్‌లో పాల్గొన్న బాలబాలికలు తూర్పు నౌకాదళానికి చెందిన వివిధ నేవీ యూనిట్లను సందర్శించనున్నారు. అంతే కాకుండా వారికి ఫైరింగ్, బోట్ పుల్లింగ్, షిప్‌ని పరిచయం చేయడం, డ్రిల్, వంటి వాటిల్లో శిక్షణను ఇస్తారు. ఈ క్యాంప్‌ను ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ పీ మహేశ్వర్ ప్రారంభించనున్నారు. క్యాంపు కమాండర్‌గా గ్రూప్ కమాండర్ కమోడోర్ అర్వింద్ నగర్ వ్యవహరిస్తారని నౌకాదళం వెల్లడించింది.
విశాఖలో జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంప్
NCC Camp: జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాంప్‌నకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్సీసీ క్యాడెట్లు హాజరుకానున్నారు.
ఎన్సీసీ