మత్స్యకార యువతతో నేవీ సిబ్బంది సమావేశం - navy
1999 కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్‌పై భారత విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులతో నౌకాదళం ప్రత్యేకంగా సమావేశమైంది.
నేవీ సిబ్బంది
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విశాఖలో కోస్ట్ గార్డ్, నౌకా దళం సంయుక్తంగా మత్స్య కారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విశాఖ సాగర తీరంలో మత్స్యకార యువకులు వేటకు వెళ్లే సమయంలో గమనించాల్సిన అంశాలను తెలియచెప్పారు. సముద్ర ప్రమాణ సమయంలో తీసుకోవాల్సిన ప్రాణ రక్షణ చర్యలను వివరించారు. గస్తీ సమయంలో సముద్ర జలాలపై అనుమానాస్పద బోట్లు, ఓడలు కనిపిస్తే వాటి సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యకార యువతతో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.