ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుడా.. అందుకో మా కృతజ్ఞతలు

కరోనా యోధులకు భారత త్రివిధ దళాలు గౌరవవందనం చేశాయి. నౌకా, వాయు సేన హెలికాప్టర్లు గగనతలం నుంచి కరోనా పోరాట యోధులపై పూలవర్షం కురిపించాయి. విశాఖ టీబీ, ఛాతీ ఆసుప్రత్రులపై తూర్పునౌకాదళ హెలికాప్టర్లు పూలు చల్లాయి.

వైద్యుడా.. అందుకో మా కృతజ్ఞతలు
వైద్యుడా.. అందుకో మా కృతజ్ఞతలు

By

Published : May 3, 2020, 7:23 AM IST

Updated : May 3, 2020, 10:26 AM IST

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచదేశాలే కొవిడ్​ను నిలువురించలేక చేతులెత్తేస్తున్న వేళ... భారత్ కరోనాకు ఎదురునిలిచింది. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా లక్షల్లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సంకల్పానికి ముఖ్యమంత్రుల ముందుచూపు తోడైంది. దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి లాక్​డౌన్ ప్రకటించాయి.

లాక్​డౌన్ ఉన్నా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. అంతంతమాత్రంగా ఉన్న వైద్యసదుపాయాలతో భారత్ నెట్టుకురాగలదా అన్న ప్రశ్నలకు వైద్యులంతా ఏకమై సమాధానం చెప్పారు. రాత్రింబవళ్లు, నిద్రాహారాలు మాని కంటికి కనిపించని శత్రువుపై బయటకు కనపడని యుద్ధం చేస్తున్నారు. కరోనా కబలిస్తుందని తెలిసినా ప్రాణాలు పణంగా పెట్టి.. వేల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కరోనాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలకు ఎంత చేసిన తక్కువే. నిరుపమాన సేవలందిస్తున్న కరోనా యోధులకు భారత త్రివిధ దళాలు పుష్పాభిషేకం చేశాయి.

భారత వాయు, నౌక దళాల హెలికాప్టర్లు దేశంలోని కొవిడ్ ఆసుపత్రులపై విహరిస్తూ గగతలం నుంచి పూల వర్షం కురిపించాయి. వైద్యుడా అందుకో మా వందనం అంటూ సెల్యూట్ చేశాయి. విశాఖ టీబీ, ఛాతీ ఆసుపత్రిపై తూర్పు నౌకదళ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. వైద్య నారాయణుడి సేవలకు అభినందన నీరాజనం తెలిపాయి.

యుద్ధ నౌకల్లో విద్యుత్ కాంతులు

విద్యుత్ అలంకరణ

వైద్య సేవలకు అభినందనలు తెలుపుతూ... విశాఖలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నౌకాదళ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జి కొవిడ్ ఆస్పత్రులను సందర్శించి వైద్యులను సన్మానిస్తారు. సాయంత్రం 7.30 గంటలకు విశాఖ సాగరతీరంలో నిలిపి ఉంచిన యుద్ధ నౌకల్లో విద్యుత్ కాంతులతో నింపుతారు. మిగిలిన తీరాలలో ఉన్న యుద్ధనౌకలను కూడా ఇదే స్థాయిలో విద్యుద్దీపాలతో రాత్రి 12 గంటల వరకు వెలిగించి ఉంచుతారు. ఈ రకంగా పోరాటం చేస్తున్న వారిని అభినందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి...కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

Last Updated : May 3, 2020, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details