మర్చంట్ నేవీలో సునీల్ అనే వ్యక్తి సీ మెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే కరోనా రావడంతో కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే కొద్ది రోజులుగా ఓ అమ్మాయి విషయంలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయే సునీల్‌పై కేసు పెట్టిందని బంధువులు చెబుతున్నారు. అదే సమయంలో కొవిడ్ రావడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటున్నారు.
కొవిడ్ చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. ప్రేమే కారణామా?
విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అతడు ఎందుకు చనిపోయినట్టు? ప్రేమే కారణామా? ఇంకా ఏదైనా సమస్యలున్నాయా?
navy employee sucide in covid hospital because of love