ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident: విశాఖలో రోడ్డు ప్రమాదం.. నేవీ ఉద్యోగి దుర్మరణం - విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్​పై రోడ్డు ప్రమాదం

విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్​పై డివైడర్​ను.. బైకు ఢీకొట్టిన ఘటన(accident in telugu talli flyover at visakha)లో ఇండియన్ నేవీ ఉద్యోగి దుర్మరణం(Navy employee died in accident) చెందాడు.

Navy employee died at vishaka
రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి దుర్మరణం

By

Published : Nov 20, 2021, 9:22 AM IST

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ నేవీలో పని చేస్తున్న ఓ వ్యక్తి (Navy employee died in road accident) మృతి చెందాడు. మృతుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్న అనిల్ కుమార్(33)గా గుర్తించారు. అనిల్​కుమార్​ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సిరిపురం నుంచి రైల్వే స్టేషన్​ వైపు దిచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్​పై డివైడర్​ను ఢీకొట్టి పక్కన(accident at telugu talli flyover at visakha) పడిపోయాడు.

అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని రాంనగర్ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు(accident at telugu talli flyover at visakha) ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ ప్రాణాలు దక్కలేదు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details