నౌకాదళాల విజయాలు, దేశ రక్షణలో అమరులైనవారి పాత్రను గుర్తుచేసుకునేందుకు.. ఏటా డిసెంబర్ 4న, నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. వారి సేవలను స్మరించుకుని... నివాళులు అర్పిస్తారు. దేశ రక్షణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే నౌకాదళానికి.. సుదీర్ఘ చరిత్ర ఉంది. 1600వ సంవత్సరంలో నౌకాయానం ద్వారా దేశంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలవగా, రక్షణ పరంగానూ నౌకల ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ పాలనలో..... నౌకాదళాన్ని 'ఇండియన్ రాయల్ నేవీ'గా పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక.. 1950లో 'ఇండియన్ నేవీ'గా మార్చారు.
నౌకదళం పాత్ర తిరుగులేనిది...
భారత దేశ ద్వీపకల్పానికి... త్రివిధదళాల్లో నౌకాదళం పాత్ర తిరుగులేనిది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో... ఆ దేశ అతిపెద్ద నౌకాశ్రయమైన కరాచీ పోర్టుపై, డిసెంబర్ 4న భారత నౌకాదళం మెరుపుదాడి చేసింది. మూడు పాకిస్థాన్ యుద్ధనౌకలను ముంచి వేసింది. జలాంతర్గామి, యుద్ధనౌకలతో... ముప్పేట దాడి చేసింది. ఆ ఘటనలో 200 మందికి పైగా పాకిస్థాన్ నావికులు, సైనికులు మరణించారు. భారత నౌకాదళం చేపట్టిన ఈ 'ఆపరేషన్ ట్రైడెంట్' విజయానికి ప్రతీకగానే... ఏటా డిసెంబర్ 4 న భారత నావికాదళ దినోత్సవం జరుపుతారు.