విశాఖలో నిర్వహిస్తున్న నావికాదళ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నావికాదళ సిబ్బందికి సీఎం జగన్ నేవీ డే శుభాకాంక్షలు తెలిపారు. నావికాదళం చేసే విన్యాసాలను ఆయన వీక్షిస్తున్నారు. తీరరక్షణ, విపత్తుల సమయంలో నావికాదళ సిబ్బంది సేవలను జగన్ కొనియాడారు. క్లీన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్‌కు స్మృతి చిహ్నాన్ని స్కైడైవర్ అందించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్ పాల్గొన్నారు. 6 వేల అడుగుల ఎత్తు నుంచి నావికాదళ సిబ్బంది స్కై డైవింగ్ చేశారు. విన్యాసాలను చూసేందుకు బీచ్రోడ్కు వేలాది మంది ప్రజలు విచ్చేశారు. విశాఖనగర వాసులతో ఆర్కే బీచ్ పరిసరాలు రద్దీగా మారాయి.
విశాఖలో నేవీ డే విన్యాసాలు.. సీఎం జగన్ హాజరు - నేవీడేకు సీఎం జగన్ హాజరు న్యూస్
విశాఖలో నేవీ డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. నావికాదళ విన్యాసాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విశాఖలో నేవీ డే విన్యాసాలు.. సీఎం జగన్ హాజరు