ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. విశ్వ విజ్ఞాన విద్య అధ్యాత్మిక పీఠం(ట్రస్టు) ఆధ్వర్యంలో రెండు గ్రంథాలు అవిష్కరించనున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 5న విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరగనున్న సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని నవమ పీఠాధిపతి డా.ఉమర్ అలీషా పేర్కొన్నారు(navama trust chairman Dr. Umar Alisha on books release). ఈ మేరకు డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
'ఈనెల 5న విశాఖలో.. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గ్రంథాల ఆవిష్కరణ' - విశ్వ విజ్ఞాన విద్య అధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో రెండు గ్రంథాలు అవిష్కరణ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా.. విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈనెల 5న రెండు గ్రంథాల ఆవిష్కరణ జరగనుందని(books release by vice president venkaiah naidu on 5th november) నవమ పీఠాధిపతి ఉమర్ అలీషా వెల్లడించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్"లో భాగంగా.. ఈ కార్యక్రమం చేపట్టిన తెలిపారు.
ట్రస్ట్ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా
విశ్వమానవ శ్రేయస్సు, తత్వ ప్రభోదం, సామాజిక శ్రేయస్సు కోసం ఈ పీఠం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వేదాంతం నుంచి జాతీయ భావం వైపు(1904-1945), డిబేట్స్ ఆఫ్ డా. ఉమర్ అలీషా ఇండియన్ నేషనల్ అసెంబ్లీ(1935-1945) అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సమావేశంలో ట్రస్ట్ కన్వీనర్ డా.ఆనంద్ కుమార్ పింగళి, పోగ్రాం కన్వీనర్ ప్రసాద్ వర్మ, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
TAGGED:
ఆజాదీకా అమృత్ మహోత్సవ్