యుద్ధ నౌకల విన్యాసం మిలన్-2020 నిర్వహణ కోసం తూర్పు నౌకాదళం ప్రధాన స్థావరంలో సన్నాహక సదస్సు జరిగింది. 17 దేశాల నౌకాదళాల నుంచి 29 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 2020లో విశాఖలో మిలన్ నిర్వహణ ఐఎఫ్ఆర్ అనుభవంతో చేస్తామని కమాండర్ సంజయ్ ఇస్సార్ వెల్లడించారు. హార్బర్, సీ ఫేజ్లపై వివరంగా చర్చించారు. 1995లో ఆరంభమైన మిలన్ విన్యాసాలు, ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతాయి. గతంలో అండమాన్ నికోబార్ దీవులకే పరిమితమైన ఈ మిలాన్ నిర్వహణ... తొలిసారి విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక దేశాల నౌకాదళాల మధ్య వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు, పరస్పర సాంకేతిక మార్పిడి కోసం మిలన్ తోడ్పడుతుందని సదస్సులో అభిప్రాయపడ్డారు.
విశాఖలో తొలిసారి మిలన్-2020 - naval exercise news latest vishaka
విశాఖలో 2020 మార్చిలో జరిగే అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసం మిలన్-2020 నిర్వహణ ప్రణాళిక కోసం విశాఖలో మూడు రోజుల సదస్సు జరిగింది.
![విశాఖలో తొలిసారి మిలన్-2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5015157-722-5015157-1573309359314.jpg)
naval exercise milan 2020 in vishaka