TRIBAL PRODUCTS: విశాఖలో జరిగిన జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు సోమవారంతో విజయవంతంగా(National Tribal Entrepreneurs Conference) ముగిసింది. పారిశ్రామికవేత్తలు తాము సేకరించిన, తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. దేశంలోనే ప్రకృతి సిద్ధంగా పూర్తి నైపుణ్యంతో ఉత్పత్తులను(Tribal products exhibition) సేకరించడంలోనూ వాటిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి మరింత శిక్షణ అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఆన్లైన్లో అమ్మకాల వల్ల పారిశ్రామికవేత్తగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తమ సత్తా చాటేందుకు వీలవుతుందని కొందరు అన్నారు. డిజిటల్ అక్షరాస్యత యువ గిరిజన పారిశ్రామికవేత్తలకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం మాత్రం పూర్తిస్థాయిలో లభించాల్సి ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన వ్యాపార వేత్తలకు సత్కారం..
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల గిరిజన పారిశ్రామికవేత్తల కార్యక్రమం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు జాతీయ షెడ్యూల్ తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఆదివాసి మహిళా స్వశక్తి కార్యక్రమం కింద రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించింది. సీఐఐ, డిక్కీ, అసోచామ్ వంటి పారిశ్రామిక నేతల సంఘాల ద్వారా ఉత్సాహవంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 86 మంది ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలను ఆయన సత్కరించారు. ఇందులో రాష్ట్రానికి చెందిన 38 మంది ఉండం విశేషం. గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణ అవసరమైన సహకారం మద్దతు ధర గురించి జీసీసీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని ఆ సంస్థ ఎండీ శోభ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే వివరించారు. మన్యంలో పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేవరకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని జీసీసీ ఛైర్మన్ శోభారాణి భరణి విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తామని గిరిజన సంక్షేమం కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Food Poison: కలుషిత ఆహారం తిని.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత!