దేశంలోని వివిధ గిరిజన సంస్కృతుల సాంప్రదాయ జానపద నృత్యాలకు విశాఖలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవంలో పట్టాభిషేకం జరుగుతోంది. పద్నాలుగు రాష్టాల గిరిజన నృత్యాలతో గిరిజన కళాకారులు అద్భుత నృత్యాలతో అలరిస్తున్నారు. ఆజాద్ కి అమృత్ మహోత్సవలో భాగంగా జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు జాతీయ గిరిజన నృత్యోత్సవాలు నిర్వహిస్తోంది. సుమారు ఐదు వందల మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్ని వారి రాష్ట్ర పురాతన గిరిజన నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. సాంప్రదాయ వస్త్రాలు, అలంకారాలతో గిరిజన వాయిద్యాలతో చేస్తున్న నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవాలు.. ఆకట్టుకుంటున్న నృత్యాలు - నృత్యాలతో గిరిజన కళాకారులు
National Tribal Dance Festival: జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు జాతీయ గిరిజన నృత్యోత్సవాలు నిర్వహిస్తోంది. వందల మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్ని వారి రాష్ట్ర పురాతన గిరిజన నృత్యాలను ప్రదర్శిస్తున్నారు.
National Tribal Dance Festival