మనం పీలుస్తున్న గాలే మనకు శత్రువా?అవును కంటికి కనిపించని శత్రువుతో సంవత్సరాలుగా పోరాడుతున్నాం. దేశంలో కరోనా వల్ల జరిగిన ప్రాణ నష్టం కన్నా గాలి కాలుష్యం వల్ల 10 రెట్లు ఎక్కువ నష్టం కలుగుదోందనేది చేదు వాస్తవం. 2019 సంవత్సరంలో గాలి కాలుష్యం కారణంగా 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక వెల్లడించింది. గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కారణాలతో ఈ మరణాలు సంభవించినా మూలం మాత్రం పీల్చే గాలిలోని ప్రాణాంతక కాలుష్య కారకాలే అని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరీ దయనీయమైన వాస్తవం ఏంటంటే కాలుష్య ప్రభావానికి లక్షా 16 వేల మంది శిశువులు జన్మించిన నెల రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
ఊహించని స్థాయిలో మనల్ని నష్టపరుస్తోన్న కాలుష్యానికి కారణం మనమే. మితిమీరిన వనరుల వినియోగం కారణంగానే వాయు కాలుష్యం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన కలగనంత కాలం కాలుష్యకారకాలకు అడ్డుకట్ట వేయలేమని నిపుణులు చెబుతున్నారు.