విశాఖలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు దేశఖ్యాతిని పెంచుతాయని.. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు గవర్నర్ సూచించారు.ఈ నెల 24 వరకు జరగనున్న పోటీల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గోనున్నారు. మొత్తం 10 విభాగాల్లో దాదాపు 3,700 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, అరకు ఎంపీ మాధవి, ఆర్ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు తులసీరామ్ అగర్వాల్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ రావు సహా పలువురు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో క్రీడాకారులు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
విశాఖలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం - విశాఖలో జాతీయ స్థాయి పోటీలు
జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 విభాగాల్లో పోటీలు జరుగుతుండగా దాదాపు 3,700 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.
![విశాఖలో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం national level roler skating championship grandly started in vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5426216-418-5426216-1576755338611.jpg)
క్రీడాకారుల విన్యాసాలు
జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం