ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

National Highway: సెప్టెంబరు 30కల్లా ఎన్‌హెచ్‌-140 పూర్తి: గడ్కరీ

National highway: చిత్తూరు-మల్లవరం మధ్య జరుగుతున్న ఎన్‌హెచ్‌-140 విస్తరణ పనులు సెప్టెంబరు 30కల్లా పూర్తవుతాయని.. కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన కింద ఎన్‌హెచ్‌-140ని చిత్తూరు నుంచి మల్లవరం వరకు 6 వరుసలుగా విస్తరించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పనులు ఈ ఏడాది సెప్టెంబరు 30కల్లా పూర్తవుతాయి.

national highway 140 works
సెప్టెంబరు 30కల్లా ఎన్‌హెచ్‌-140 పూర్తి

By

Published : Jun 13, 2022, 7:56 AM IST

National highway: చిత్తూరు-మల్లవరం మధ్య జరుగుతున్న ఎన్‌హెచ్‌-140 విస్తరణ పనులు సెప్టెంబరు 30కల్లా పూర్తవుతాయని.. కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. పూర్తయిన రహదారి చిత్రాలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘భారత్‌ను సౌభాగ్యంతో అనుసంధానిస్తున్నాం. దేశాన్ని ప్రపంచ మౌలికవసతుల కేంద్రంగా మార్చే నవభారత నిర్మాణం కోసం కేంద్ర రహదారి రవాణాశాఖ 24 గంటలూ యంత్రంలా పనిచేస్తోంది.

భారత్‌మాల పరియోజన కింద ఎన్‌హెచ్‌-140ని చిత్తూరు నుంచి మల్లవరం వరకు 6 వరుసలుగా విస్తరించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు 2021 మే నుంచి ఉపయోగంలోకి వచ్చింది. మిగిలిన పనులు ఈ ఏడాది సెప్టెంబరు 30కల్లా పూర్తవుతాయి. ఈ సెక్షన్‌ కాణిపాకం మీదుగా చిత్తూరు, తిరుపతిని అనుసంధానం చేస్తుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details