మనం.. ఓ వస్తువు కొన్నా, సేవ పొందినా.. దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ క్రమంలో.. వస్తువు పాడై ఉన్నా, సేవలు సరిగ్గా అందకపోయినా.. ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. గతంలో ఉన్న వినియోగదారుల ఫోరం.. కేంద్రం చేసిన కొత్త చట్టంతో కమిషన్‌గా మారింది. సేవా లోపాలు, వస్తువుల గ్యారంటీపై రెండేళ్లలోగా కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కొనుగోలు చేసినప్పటి బిల్లు తప్పనిసరిగా భద్రపర్చుకోవాలి. ఫిర్యాదు చేసేందుకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
- వస్తువు లేదా సేవ విలువ 5 లక్షల లోపైతే ఎలాంటి ఫీజు లేదు...
- 5 నుంచి 10 లక్షల మధ్య అయితే 200 రూపాయలు...
- 10 నుంచి 20 లక్షల మధ్య అయితే 400...
- 20 నుంచి 50 లక్షల మధ్య అయితే వెయ్యి...
- అరకోటి నుంచి కోటి మధ్య 2వేలు....
- కోటి నుంచి 2 కోట్ల మధ్య రెండున్నర వేలు....
- 2 నుంచి 4 కోట్ల మధ్య మూడు వేలు....
- 4 నుంచి 6 కోట్ల మధ్య 4 వేలు....
- 6 నుంచి 8 కోట్ల మధ్య 5 వేలు...
- 8 నుంచి 10 కోట్ల మధ్య 6వేలు...
- 10 కోట్లపైన అయితే ఏడున్నర వేల రూపాయలు.. ఫీజు కింద చెల్లించాలి.