విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందో లేదో కానీ, వైకాపా మార్క్ పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్‌గా పనిచేస్తున్న అపోలో ఫార్మసీ ఉద్యోగిని లక్ష్మీ ప్రసన్నపై పోలీసులు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ పై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించటం.. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ను తన ట్విట్టర్ కు లోకేశ్ జత చేశారు.
ఇదీ చదవండి