ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు మానండి.. చిత్తశుద్ధితో పోరాడండి'

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు' మాని.. చిత్తశుద్ధితో పోరాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు మాని చిత్తశుద్ధితో పోరాడండి
దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు మాని చిత్తశుద్ధితో పోరాడండి

By

Published : May 22, 2021, 11:49 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు' మాని చిత్తశుద్ధితో పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఆయన ఉద్యమాభివందనలు తెలిపారు.

"విశాఖ ఉక్కును.. తుక్కు రేటుకు కొట్టేసి కార్మికుల ఊపిరి తీయాలని జగన్ కుట్రలు చేస్తుంటే.. స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు" అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ కార్మికుల పక్షాన తెదేపా పోరాడుతుందని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details