కార్మికుల పక్షాన ఉన్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ ఉక్కుని తుక్క ధరకు కొట్టేయాలనేది జగన్ ప్రణాళిక అని విమర్శించారు. జగన్‌కు అడ్డుగా నిలిచారనే పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. అందుకే వైకాపా ప్రభుత్వాన్ని జేసీబీ ప్రభుత్వం అన్నదని వ్యాఖ్యానించారు. కనీసం నోటీసు ఇవ్వకుండా భవనం కూల్చివేత సరికాదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా.. కాపాడేందుకు తెదేపా దేనికైనా సిద్ధమన్నారు.
ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారు: లోకేశ్ - విశాఖలో పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత వార్తలు
పల్లా భవనం కూల్చివేతను నారా లోకేశ్ ఖండించారు. ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారని విమర్శించారు.

nara lokesh on cm jagan