ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి: టికాయత్ - టికాయత్ కామెంట్స్ న్యూస్

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు జాతీయ రైతు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై..కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేశ్‌సింగ్ టికాయత్ అన్నారు.

must fight central government against anti-democratic programs
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి

By

Published : Apr 18, 2021, 4:31 PM IST

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేశ్‌సింగ్ టికాయత్ అన్నారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు జాతీయ రైతు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఒకపక్క కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడాతుంటే..భారీ పరిశ్రమల్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ఆలోచన చేయడం దారుణమన్నారు. అందరం కలిసి పోరాడి..ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details