విశాఖలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇసుకతోట రామాలయం వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడిని ఒడిషాకు చెందిన దేవరాజ్ నాయక్ గా గుర్తించారు. పిండి రుబ్బే గ్రైండర్ లో ఉండే... రాళ్లతో దేవరాజ్ పై దాడి జరిగినట్టు ఘటనా స్థలంలో ఉన్న దృశ్యం ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ జరిగింది...
కొద్ది నెలల క్రితం ఒడిషాలోని ఒకే కుటుంబానికి చెందిన దేవారాజ్ నాయక్, గిరి అనే యువకులు స్థానిక కింగ్స్ రెస్టారెంట్ లో టీ మాస్టర్లుగా పనిచేసేందుకు వచ్చారు. వీరిద్దరి మధ్య నిన్న రాత్రి గొడవ జరగడంతో... ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరచుకున్నారు. ఈ ఘర్షణలో దేవరాజ్ నాయక్ చనిపోగా గిరి అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు.