సమస్యల పరిష్కారం కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. అనంతపురంలో కార్మికుల తలపెట్టిన సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కార్మికులు సృహ కోల్పోయారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. . పోలీసులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ అనంతపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. 20 మందిని అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. మడకశిర పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తలుపుల మేజర్ పంచాయతీ పారిశుధ్యకార్మికులు సచివాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
విశాఖ జిల్లాలో...
వేపగుంట జోనల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనాతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సక్రమంగా జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. విశాఖలోని జోనల్ కార్యాలయాల ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు.
ప్రకాశం జిల్లాలో...