మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాష్ రావు(peddada prakash rao) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖ జిల్లా చోడవరంలోని ఎమ్మార్పీఎస్ సభలో(MRPS meeting in chodavaram) మాట్లాడుతూనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. తోటి నాయకులు చికిత్స నిమిత్తం ప్రకాష్ రావును ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు(heart attack)తో ఆకస్మాత్తుగా మరణించిన ప్రకాష్ రావు అంత్యక్రియలు(funerals) విశాఖలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.
LIVE VIDEO : సభలో ప్రసంగిస్తూనే.. నాయకుడి హఠాన్మరణం!
విశాఖ జిల్లా చోడవరంలో(chodavaram) విషాదం నెలకొంది. రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దాడ ప్రకాష్ రావు(prakash rao died).. ఎమ్మార్పీఎస్ సభలో మాట్లాడుతూనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
LIVE VIDEO : సభలో ప్రసంగిస్తూ... మృత్యుఒడికి
త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ వాదనను వినిపించేందుకు.. విద్యార్థులతో నిర్వహించబోయే "ఛలో దిల్లీ" కార్యక్రమం గురించి చోడవరంలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో(ambedkar meeting) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాడ ప్రకాష్ రావు.. మాట్లాడుతూనే ఒక్క సారిగా కుప్పకూలి చనిపోయారు. ఈ హఠాత్పరిణామానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇదీచదవండి.