శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం ,పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా నేతలు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
'మాకు న్యాయం కావాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి' - తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని శిక్షించాలని కోరుతూ.. గుంటూరులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
mrps
ఉద్యోగాల్లో సమన్యాయం కోసం....
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న లక్షా 30 వేల ఉద్యోగాల్లో మాల మాదిగలకు, ఉప కులాలకు సమాన అవకాశాలు కల్పించాలంటూ... విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ధర్నా చేపట్టింది. సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.