మురికివాడలు లేని విశాఖ నగరాన్ని సృష్టిస్తామని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ పరిధిలోని 51వ వార్డు ఏకలవ్య కాలనీలో రూ. 176.34 లక్షల నిధులతో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి అవంతి, నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎంపీ సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు.
పురపాలక ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని యుద్ధప్రాతిపదికన నెరవేర్చుతామని తెలిపారు. నగర పరిధిలోని 740 మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏకలవ్య కాలనీలో నివాస స్థలాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. మురికివాడల్లో సామాజిక భవనాలు, పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు.