రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో కొత్త ఉత్పత్తులు వస్తుంటే... అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం గ్రీన్‌సిటీ క్లబ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... ‘సింహాద్రి టీఎంటీ ఎఫ్‌ఈ 550డి’ ఉత్పత్తిని ఆవిష్కరించారు. కొత్త ఉత్పత్తులతో ఆయా పరిశ్రమల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, గాజువాక ఎన్నికల అధికారి సతీష్‌వర్మ, వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్స్ వీరమాచినేని కృష్ణారావు, చిగురుపాటి రవి తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఉత్పత్తులతో అభివృద్ధి సాధ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి - విశాఖ టీఎంటీ ఎఫ్‌ఈ 550డి
‘సింహాద్రి టీఎంటీ ఎఫ్‌ఈ 550డి’ ఉత్పత్తిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. కొత్త ఉత్పత్తులు వస్తుంటే అన్ని రంగాలలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు.
mp vijaysai reddy started simhadri TMT FE 550 product