ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vijaya Sai: లోకేశ్ వాడుతున్న భాష అసభ్యకరం: విజయసాయి

సంక్షేమ పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని ఆక్షేపించారు.

లోకేశ్ వాడుతున్న భాష అసభ్యకరం
లోకేశ్ వాడుతున్న భాష అసభ్యకరం

By

Published : Nov 14, 2021, 8:12 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తెదేపా భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి ఈ విధమైన భాష మాట్లాడటం సమంజసమా ? అని ప్రశ్నించారు. సంక్షేమ పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే..

రాష్ట్రంలో జరగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాదే విజయమని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విశాఖలోని ఆయన నివాసంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు వైకాపాలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయి..జీవీఎంలోని రెండు వార్డుల్లో వైకాపా అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు 2024లో వైకాపా విజయానికి సంకేతాలన్నారు.

ఇదీ చదవండి

Kanakamedala: భాష గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం: కనకమేడల

ABOUT THE AUTHOR

...view details