MP Vijayasai Reddy on Vishaka Administrative capital: ఎవరు అడ్డుపడినా.. విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధాని తరలింపు ఆలస్యమవుతోందని.. ఎవరు ఔనన్నా.. కాదన్నా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని చెప్పారు. ఆ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదుల్ని, కాలువలను ఆక్రమించుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి కోర్టులో తాత్కాలిక ఊరటే దక్కిందని చెప్పారు. పంట కాల్వను ఆక్రమించిన అయ్యన్నకు చట్టపరంగా శిక్ష తప్పదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy: 'ఎవరు అడ్డుపడినా.. విశాఖనే పరిపాలనా రాజధాని' - విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం
ఎవరు అడ్డుపడినా... విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్లే రాజధాని తరలింపు ఆలస్యమవుతోందన్నారు. పంట కాల్వను ఆక్రమించిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి చట్టపరంగా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.
mp Vijayasai Reddy
అధినేత ఆదేశాల ప్రకారమే..:రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ఇవ్వాలనే విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. అధినేత ఆదేశాల ప్రకారమే తామంతా నడుచుకుంటామన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: