రాజధానిపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశానికి ముందు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్... విశాఖకు కార్యనిర్వాహక రాజధానిగా గొప్ప బహుమతి ఇచ్చారని పేర్కొన్నారు. 'ఎగ్జిక్యూటివ్ కాపిటల్' గా ప్రకటించాక ఈ నెల 28న తొలిసారి విశాఖ వస్తున్న జగన్కు కృతజ్ఞతగా విమానాశ్రయం నుంచి మానవహారం నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి కొందరు అడ్డు పుల్లలు వేస్తున్నారన్న విజయసాయి... భూ అక్రమాల ఆరోపణలను తోసిపుచ్చారు. విశాఖలో తనకు ఒక ప్లాట్ మాత్రమే ఉందన్నారు.
'ఆరోపణలు అవాస్తవం... ఒక్క ప్లాట్ మాత్రమే ఉంది' - ఏపీలో మూడు రాజధానులు వార్తలు
విశాఖ కార్యనిర్వాహక రాజధానికి కొందరు అడ్డు పుల్లలు వేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. తనపై వస్తున్న భూ అక్రమాల ఆరోపణలను కొట్టిపారేశారు. విశాఖలో తనకు ఒక్క ప్లాట్ మాత్రమే ఉందన్నారు.
!['ఆరోపణలు అవాస్తవం... ఒక్క ప్లాట్ మాత్రమే ఉంది' MP VijayaSai Reddy reaaction on allegations over illegala assets in vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5498455-1025-5498455-1577348603024.jpg)
MP VijayaSai Reddy reaaction on allegations over illegala assets in vishaka
'ఆరోపణలు అవాస్తవం... ఒక్క ప్లాట్ మాత్రమే ఉంది'
ఇదీ చదవండి : 'ముఖ్యమంత్రి మనసు మారాలని ప్రార్థిస్తున్నాం'