స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభను తలపెట్టారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.... పార్లమెంట్ లోపల, బయటా రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.