ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు: ఎంపీ విజయసాయి - ఎంపీ విజయసాయి తాజా వార్తలు

విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ నగరాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన...జీఐఎస్‌ బేస్‌డ్‌ ల్యాండ్‌ మానిటరింగ్ సిస్టంను ప్రారంభించారు.

విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు
విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు

By

Published : Jan 1, 2021, 5:52 PM IST

విశాఖ నగరాభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో వీఎంఆర్‌డీఏ భూముల పరిరక్షణపై చర్చించారు. జీఐఎస్‌ బేస్‌డ్‌ ల్యాండ్‌ మానిటరింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ.. కొత్త విధానం ద్వారా వీఎంఆర్‌డీఏ భూములను పరిరక్షించవచ్చన్నారు.

కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని...,లోటుపాట్లు సరిచేసుకుని ముందుకెళ్తామన్నారు. విశాఖలో భూకబ్జాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని విజయసాయి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న అక్రమ లేఅవుట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details