'జోన్ ప్రకటన నిరుపయోగం' - central
శ్రీకాకుళం, విజయనగరం డివిజన్లను కలపకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఫలితం ఉండదని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆదాయం రాకపోగా, విశాఖవాసులుకు ఉద్యోగాలు కూడా లభించలేవని అభిప్రాయపడ్డారు. వాటిని కూడా కలిపి జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుబ్బిరామిరెడ్డి
ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో ఏళ్లకల విశాఖ కేంద్రంగా రైల్వే జోన్... అలాంటిది ఇక్కడ ప్రజలకు నష్టం కలిగించేలా జోన్ ప్రకటించిన తీరు ఉందని రాజ్య సభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయ నగరం , శ్రీకాకుళం జిల్లాలు లేకుండా కేవలం విశాఖ ఉన్న జోన్ తో ఈ ప్రాంత ప్రజలకు మేలు ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజా పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు.